KDP: వల్లూరు మండలం పెద్ద లేబాకు గ్రామంలో కరెంట్ షాక్తో రెండు గేదెలు మృతి చెందాయి. ట్రాన్స్ఫార్మర్ వద్ద ముందుగా దూడ తగలగా, దాన్ని కాపాడేందుకు వెళ్లిన తల్లిదూడ కూడా షాక్కు గురైంది. ఈ ఘటనతో రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లగా, విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధితుడికి తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.