ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లో కొత్త విద్యుత్ కారును లాంచ్ చేసింది. YL పేరిట కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.61.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అధిక వీల్‌బేస్, 6 సీటర్ కెపాసిటీతో వస్తోంది. సింగిల్ ఛార్జింగ్‌తో 681 కి.మీ. ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌ను చైనాలో విడుదల చేయగా అమెరికాలో ఇంకా లాంచ్ చేయకపోవడం గమనార్హం.