కృష్ణా: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో భాస్కరరావు చేసిన సేవలు, ఏపీ రాజకీయ చరిత్రలో ఆయన చేసిన పాత్ర చిరస్మరణీయంగా మిగిలిపోతాయని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఎంపీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.