SKLM: ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉండకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు సేవల నాణ్యత పెంచాలని, రోడ్ల మరమ్మతులు వేగవంతం చేయాలని, తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఉపాధి హామీ పనులు పెంచి, రెవెన్యూ సేవలు గడువులో పూర్తి చేయాలని సూచించారు.