PLD: నరసరావుపేట ప్రకాష్ నగర్లో చోరీ యత్నం విఫలమైంది. రాంప్రసాద్ కుటుంబం శిరిడీ యాత్రకు వెళ్లింది. ఇదే సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇల్లంతా వెతికినా ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగారు. సమాచారం అందుకున్న సీఐ ఫిరోజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.