KMR: మెదక్ మండలం మనోహరాబాద్‌కు చెందిన గడ్డం నరసవ్వ(70) KMR లోని మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ కోనేరులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. ఉదయం స్నానానికి వెళ్లిన ఆమె కాలుజారి నీట మునిగారు. బంధువు మహిపాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరిపై అనుమానం లేదని కుటుంబ సభ్యులు తెలపడంతో, పంచనామా పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.