AP: పేదల సొంతింటి కలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని మాజీమంత్రి కాకాణి విమర్శించారు. పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో జగన్ పనిచేశారని పేర్కొన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం చంద్రబాబు హయాంలో భారం.. జగనన్న పాలనలో వరంగా మారిందన్నారు. వైసీపీ హయాంలో పేదలందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఒక యజ్ఞంలా సాగిందన్నారు. జగనన్న కాలనీలు కాదని.. ఊళ్లు నిర్మించారని అన్నారు.