TG: వరంగల్ జిల్లా మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సాదు సంగీత (33) అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమె భూపాలపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.