TG: కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. గత్యంతరం లేకే సమ్మెకు వెళ్తున్నామని తెలిపారు. ఎవరు భయపెట్టినా.. ఏం చేసినా సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ.. అన్ని డిపోలను అలర్ట్ చేసింది. ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం అందించింది. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు.. డిపోలకే పరిమితం కానున్నాయి.