రేపు లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఇరు జట్లు చెరో 6 మ్యాచ్లు ఆడగా.. RR 4 విజయాలతో 3వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, LSG 2 విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ పోరును హాట్స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో వీక్షించవచ్చు.