ADB: బోథ్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన జాదవ్ సుభాష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా కల్పించారు.