VKB: ఈనెల 23వ తేదీన యాలాల మండలంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా పర్యటించనున్నారని క్యాంపు కార్యాలయ ఉద్యోగులు ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా అగ్గనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం, పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. ముద్దాయిపేటలో కొత్త పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేస్తారు.