SRCL: రెండు మోటారు సైకిళ్లు ఢీ కొట్టుకున్న సంఘటనలో చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మంగళవారం తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. నర్సింగపూర్ గ్రామానికి చెందిన పర్శరాములు బైక్‌పై పేట్రోల్ బంక్ వెళ్తుండగా బస్టాండ్ సమీపంలో జోగాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుల్లెట్ బైక్‌తో ఢీ కొట్టాడని తెలిపారు.