WGL: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు, నిల్వలపై కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట సాగై 2.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైందని తెలిపారు. కొనుగోళ్లు వేగవంతం చేసి మద్దతు ధర సమయానికి చెల్లించాలని అధికారులను ఆదేశించారు.