BDK: ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కొత్తగూడెం స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ స్టేషన్ ప్రాంగణంలో ఈ వేలం పాట ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు నిర్ణీత సమయానికి హాజరై ఈ వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు.