BDK: కొత్తగూడెం పరిసర ప్రాంతంలో ఆదివారం జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన బాలుడు మృతి చెందాడు. అశ్వాపురం మండలం మామిళ్లవాయికి చెందిన రాహుల్ బైక్పై నుంచి జారి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, ఈ రోజు కాసేపటి క్రితం ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.