MLG: ఉచిత బస్ ప్రయాణ పథకంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఫ్రీ బస్ పథకాన్ని “పనికిమాలినది”గా అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. నిజంగా ఈ పథకం పనికిరాదని భావిస్తే, దాన్ని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.