SKLM: లావేరు మండలం జాతీయ రహదారిపై రావి వలస కూడలి వద్ద పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 14 పశువులను ఎస్సై కె.అప్పలరాజు పట్టుకున్నట్లు తెలిపారు. మూడు వాహనాలను సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అక్రమంగా పశువులను తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.