BPT: అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వరూధిని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) అవిసెన జ్యోతి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మండలంలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఆమె వెల్లడించారు.