PPM: భామిని మండల సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కొనసాగుతోంది. బిల్లుమడ, పసుకిడి, నేరడి పరిసరాల్లో కనిపించిన గజరాజులు ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలోని వన్నా, గౌరీ గ్రామాల సమీప జీడిమామిడి తోటల వద్ద తిరుగుతున్నాయి. వేసవి తీవ్రత పెరగడంతో నీటి కోసం వంశధార నదీ తీరానికి వస్తున్నట్లు సమాచారం.