TG: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో సర్వీసులు పెంచాలని నిర్ణయించింది. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకో మెట్రో ట్రైన్, నాగోల్-రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆర్టీసీ సమ్మె దృష్ట్యా మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.