ADB: తలమడుగు, తాంసీ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్లకు బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం మొబైల్ ఫోన్లు అందజేశారు. బాల్య దశలోని విద్యార్థులకు చదువుతోపాటు పౌష్టికాహారాన్ని అందజేయడంలో అంగన్వాడీల టీచర్ల పాత్ర కీలకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.