భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు సత్యజిత్ రే. దర్శకుడిగానే కాక రచయిత, చిత్రకారుడు, సంగీత కారుడిగానూ రాణించారు. సామాన్యుల జీవితంలోని సహజత్వాన్ని, భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించడంలో ఆయనది అందెవేసిన చేయి. ‘పథేర్ పాంచాలి’ వంటి కళాఖండాలతో ఖ్యాతి గడించి, ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ‘లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్’ అవార్డునూ అందుకున్నారు.