GDWL: జిల్లా మల్దకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప)ని బుధవారం గద్వాల జూనియర్ సివిల్ జడ్జి ఎన్.వి. హైమా పూజిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు చైర్మన్ ప్రహ్లాద రావు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్జికి స్వామివారి శేష వస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు.