JN: ఉపాధి వేతన లక్ష్యాలను చేరుకోవాలి జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పురోగతి నిర్వహణపై బుధవారం నిర్వహించిన వీసీలో పాల్గొని మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించి, దినసరి వేతనం అందేలా చూడాలని, నిర్దేశించిన లక్ష్యాలను తప్పకుండా చేరుకోవాలన్నారు.