TG: కాళేశ్వరంలో స్కామ్ జరగలేదని, నిధులు దుబారా కాలేదనే అంశాలు హైకోర్టు తీర్పులో లేవని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సాక్షులు, ముద్దాయిలను విచారించే అంశంలో హైకోర్టుకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తాము భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే తాత్కాలికంగా నిలిపివేసింది తప్ప జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.