TG: హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రజలు గెలిచారని మాజీమంత్రి KTR అన్నారు. ‘కాంగ్రెస్ ఓడింది.. రైతులు గెలిచారు. రాజకీయ రాబంధులకు మొహం పగిలే తీర్పిది. కూలింది కాళేశ్వరం కాదు, ఆ ప్రాజెక్టుపై కుట్రలు కూలాయి. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగింది. రేవంత్ రెడ్డి కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కాళేశ్వరం భూమి ఉన్నంత వరకు ఉంటుంది’ అని పేర్కొన్నారు.