కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను డీఆర్డీవో విజయలక్ష్మి సందర్శించారు. డీపీఎం మార్కెటింగ్ సాయిలు, డీపీఎం ఐబీ శ్రీనివాస్‌తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పనితీరును పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని తెలిపారు.