SDPT: సిద్దిపేట ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే సమ్మె ఎందుకు చేస్తారని, తక్షణమే ఆ గుర్తింపు ఇస్తే సమ్మె విరమిస్తారు కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.