AP: ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్టు రానుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ఎనర్జీ ప్లాంట్‌ను రూ.5,400 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. సుమారు 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఈ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.