CTR: చిత్తూరు జిల్లాలో పోలీసులు వినూత్నంగా హెల్మెట్ పెట్టు – బహుమతి పట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత రెండు వారాలుగా సేకరించిన వారి వివరాలతో పోలీస్ గెస్ట్ హౌస్లో ఎస్పీ తుషార్ లక్కీ డిప్ ద్వారా బుధవారం విజేతలను ఎంపిక చేశారు. పలు విభాగాలలో 42 మందిని బహుమతుల కోసం ఎంపిక చేశారు.