ఏలూరు పట్టణంలో ఇవాళ కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ కిషోర్ పర్యటించారు. సాధారణ ప్రజలకు ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు ఈ పర్యటన చేసినట్లు తెలిపారు. నగరంలో అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, విస్తరణ సమయంలో ప్రజలకు తక్కువ ఇబ్బంది కలిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.