JGL: కథలాపూర్ మండలంలో ఉపాధి హామీ పనుల పురోగతిపై కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా చేరుకోవాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో మరిన్ని కూలీలకు పని కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని సూచించారు. పనుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, హాజరు నమోదు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.