MDCL: మౌలాలి పరిధి హనుమాన్ నగర్ ప్రాంతంలో బాక్స్ డ్రెయిన్ మూత పూర్తిగా పాడవడంతో గత కొన్ని నెలలుగా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓ పిల్లాడు అందులో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు ప్రథమ చికిత్స సైతం అందించారు. అయినప్పటికీ అధికారులు సరైన మూతలు ఏర్పాటు చేయకపోవడం పై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.