ADB: యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఆధునిక ప్రపంచంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజార్షి షా సూచించారు. శుక్రవారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన ఆధునిక నైపుణ్యాభివృద్ధి అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. స్వయం ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయన్నారు. యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.