WGL: నర్సంపేట RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా, MLA నిధుల నుంచి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు నర్సంపేట RDO ఉమారాణి తెలిపారు. కుటుంబంలో ఒకరికి RTCలో ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.