MBNR: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆర్టీసీ ఆందోళనపై ఆయన ఆరా తీసి, సంయమనం పాటించాలని సూచించారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండి, చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని కార్మికులకు చెప్పారు.