MLG: జిల్లా పోలీసు అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన“పోరు కన్నా ఊరు మిన్న-మన ఊరికి తిరిగి రండి”అనే అవగాహన కార్యక్రమం ఫలితంగా సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన పార్టీ సభ్యురాలు ముడియం రామే అలియాస్ రజిత ఇవాళ ఎస్పీ రామ్నాథ్ కేకన్ ముందు లొంగిపోయారు. సరెండర్ పాలసీలో భాగంగా రూ. 25 వేలను ఎస్పీ ఆమెకు అందజేశారు.