ADB: తెలంగాణ కళాశాల విద్య కమిషనరేట్ వారు డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన జిజ్ఞాస ప్రాజెక్టుకు ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని ప్రిన్సిపల్ టి. ప్రతాప్ సింగ్ తెలిపారు. తెలుగు, జంతు, గణిత, ఆర్థిక శాస్త్రం విభాగాల నుంచి ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికకావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.