SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని రాష్ట్ర డీజీపీ బీ. శివధర్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారిని అనంతరం పూజలు నిర్వహించారు. కలెక్టర్ గరీమ అగర్వాల్, ఎస్పీ మహేష్ పి గీతే, ఆర్డీవో రాధా బాయి, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేదొక్త ఆశీర్వచనం నిర్వహించారు. కాగా, డీజీపీకి స్వామి వారి చిత్రపటం, లడ్డు ప్రసాదం అందజేశారు.