SRD: జిల్లాలో బుధవారం రూ.10.34 లక్షల విలువ గల 20.690 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి సాగు/రవాణాపై ప్రజలు 8712656777కు సమాచారం ఇవ్వాలన్నారు. వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.