PDPL: డ్రంక్ అండ్ డ్రైవ్లో రెండోసారి పట్టుబడిన ఓ వ్యక్తికి గోదావరిఖని కోర్టు ఇవాళ 3 రోజుల జైలు శిక్ష విధించింది. మొదటిసారి పట్టుబడ్డ మరో ఇద్దరికి రూ. 4,000 చొప్పున జరిమానా విధించినట్లు రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా సీఐ తెలిపారు.