RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 పరుగులు చేయడంతో, IPL చరిత్రలో 500 పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. వైభవ్ కేవలం 15 ఏళ్ల 26 రోజుల వయస్సులోనే ఈ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పృథ్వీ షా (19 ఏళ్ల 164 రోజులు) పేరిట ఉండేది.