PLD: చిలకలూరిపేటలో వేసవి ఎండల నేపథ్యంలో బాణాసంచా గోడౌన్లలో అగ్ని ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జేసీ సంజనా సింహా హెచ్చరించారు. చిలకలూరిపేటలోని ‘సీ మార్ట్’ గోడౌన్ను తనిఖీ చేసిన ఆమె, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.