NRPT: బీసీలకు జరుగుతున్న అన్యాయంపై, బీసీ హక్కుల కోసం పోరాడుదాం అని బీసీ ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలోని జలలింగేశ్వర ఆలయంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. మే నెలలో బీసీ గర్జన కార్యక్రమానికి సన్నహాక సమావేశం నిర్వహించడం జరిగిందని ఐక్యవేదిక నాయకులు వెంకట్ రాములు,సుదర్శన్, కృష్ణయ్య పేర్కొన్నారు.