GDWL: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. బుధవారం వల్లూరులోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఆయన.. సెప్టిక్ ట్యాంక్, ప్రహరీ మరమ్మతులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని వసతి గృహాల్లో మైనర్ రిపేర్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.