BHPL: జిల్లా కేంద్రంలో RTC కార్మికుల సమ్మెకు CPI(ML) మద్దతు ప్రకటించింది. జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేసి బకాయిలు చెల్లించాలని, ప్రైవేటు బస్సుల నియంత్రణ అవసరమన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు.