SRPT: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న 4 ఇనుప బీరువాలు, 6 ఇన్వర్టర్ బ్యాటరీలను మే 2న ఉదయం 11:30 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకట రమణ ఈరోజు తెలిపారు. ఆసక్తి గలవారు నిర్ణీత ఈఎండీ చెల్లించి వేలంలో పాల్గొనాలని, మరిన్ని వివరాల కోసం కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని ఆయన సూచించారు.