కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఉన్నంత లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అధికారులు పాల్గొన్నారు.