WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని కొత్తగా వివిధ పోలీస్ స్టేషన్లకు నియమిస్తూ స్థానచలనం చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు జరిగినట్లు సీపీ వెల్లడించారు.